ETV Bharat / snippets

బస్సు ఛార్జీలు పెంచలేదు - తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

TELANGANA RTC BUS CHARGES NEWS
TGSRTC on Normal Bus Charges (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 13, 2024, 8:15 AM IST

TGSRTC on Normal Bus Charges : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణ ఛార్జీలు యథాతథంగానే ఉన్నట్లు ఆర్టీసీ సంస్థ ప్రకటించింది. హైవేలపై టోల్‌ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ పెంచిన టోల్ ఛార్జీల మేరకు టికెట్‌లోని టోల్‌సెస్‌ను సవరించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఈ సవరించిన టోల్‌సెస్ ఈనెల 3 నుంచే అమల్లోకి వచ్చాయని సంస్థ అధికారులు పేర్కొన్నారు. టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్‌సెస్‌ను సవరించినట్లు యాజమాన్యం వెల్లడించింది. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవని తెలిపింది. సాధారణ బస్ ఛార్జీలు పెంచారంటూ ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడాన్ని ఆర్టీసీ ఖండించింది. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.