ETV Bharat / snippets

సింగపూర్​లో కోదాడ యువకుడు అనుమానాస్పద మృతి - హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 4:18 PM IST

kodada Man Suspicious Death in Singapore
Telangana Man Suspicious Death in Singapore (ETV Bharat)

Telangana Man Suspicious Death in Singapore : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ అనే యువకుడు నిన్న రాత్రి సింగపూర్ బీచ్​లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. గత ఏడాదిన్నరగా సింగపూర్​లో సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తున్న పవన్ నిన్న బీచ్​లో శవమై తేలాడు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. బీచ్​లో పవన్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పాస్​పోర్ట్ సహాయంతో తోటి మిత్రులను విచారిస్తున్నారు.

మృతిని తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. తండ్రి శ్రీనివాసరావు కోదాడలో పల్లినూనె వ్యాపారం చేస్తుండగా, పెద్ద కుమారుడు లండన్​లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు నెలల్లో మృతుడు పవన్ అమెరికాకు వెళ్లిపోవాల్సిన సమయంలో ఇలా జరగడం పట్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు. మృతదేహాన్ని త్వరగా ఇంటికి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.