Telangana Forest Officers Conducts Catch the Trap : వన్యప్రాణులను ఉచ్చులు పెట్టి హత్య చేస్తున్న ఘటనలపై తెలంగాణ అటవీ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవింగ్‌లో వన్యప్రాణులను వేటాడేందుకు పెట్టి ఉన్న రకరకాల ఉచ్చులను, వేటాడే ఆయుధాలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఆటోనగర్‌లోని డీర్ పార్క్‌లో రాష్ట్ర అటవీశాఖ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, మోహన్ చంద్ర ఫర్గెన్ మాట్లాడుతూ వన్యప్రాణులను రక్షించడంలో తెలంగాణ ఫారెస్ట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉంటున్నారని తెలిపారు.
తెలంగాణ 2023 డిసెంబర్ నుంచి "క్యాచ్ ద ట్రాఫ్" అనే పేరుతో వన్యప్రాణులను రక్షించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంతో గ్రామీణ ప్రాంతాలను మొదలుకొని ఫారెస్ట్ అన్ని ప్రాంతాలలో వేలకొద్దీ వన్యప్రాణులను రక్షించినట్లు తెలిపారు. వన్యప్రాణులను వేటాడితే కఠినమైన చర్యలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 6నెలలలో 4వేల ఉచ్చులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.