TDP State President Met Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు పల్లా శ్రీనివాసరావు ఆయన నివాసానికి వెళ్లారు. గంటన్నర పాటు సాగిన ఆత్మీయ సమావేశంలో జనసేన టీడీపీ శ్రేణులు సమన్వయంతో రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణుల్లో ఎక్కడా పొరపొచ్చాలు లేకుండా నేతలు వ్యవహరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన ఆదరణను మరింత పెంపొందించుకొని నిలబెట్టుకునేలా క్షేత్రస్థాయిలో వ్యవహరించాల్సిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.