Singareni Coal Production : భారీ వర్షాలతో సింగరేణివ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఉపరితల గనుల్లో భారీ యంత్రాలు నడిచే పరిస్థితి లేక 80 శాతం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ నెల 15 నుంచి కురుస్తున్న వర్షాలతో ఉపరితల గనుల్లోకి వెళ్లే రహదారులు బురదమయంగా మారడంతో భారీ యంత్రాలు లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
వర్షాల నేపథ్యంలో క్వారీల్లో ఉన్న భారీ యంత్రాలను అధికారులు ముందు జాగ్రత్తగా పైకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకూ 1,46,595 టన్నుల ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీరాంపూర్, ఇందారం, రామకృష్ణాపూర్ గనుల్లోకి కూడా వర్షపునీరు చేరినట్లు తెలిపారు.