ETV Bharat / snippets

ప్రీ-లాంచింగ్ పేరుతో మోసం - సాహితీ ఇన్​ఫ్రా ఎండీని విచారిస్తున్న ఈడీ

author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

SAHITYA INFRA SCAM
SAHITI INFRA MD IN ED CUSTODY (ETV Bharat)

Sahitya Infra Scam : ప్రీ-లాంచింగ్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ ఫ్రా నిర్వాహకుడు బూదాటి లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రీ-లాంచింగ్ పేరుతో వేల మంది నుంచి సుమారు రెండున్నర వేల కోట్లు వసూలు చేసిన సాహితీ సంస్థ వారికి ప్లాట్లు అప్పగించకుండా మోసగించినట్లు ఆరోపణలున్నాయి. ఇదే విషయమై పోలీసులు 2022లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. హైదరాబాద్ సెంట్రల్​ క్రైమ్​ స్టేషన్ పోలీసులు గతంలో లక్ష్మీనారయణను అరెస్టు చేసి, జైలుకు తరలించారు. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు హైదరాబాద్​లోని కార్యాలయంలో ఆయనను విచారణ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.