Police Destroy Drugs in Hyderabad : మాదకద్రవ్యాల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక వైపు డేగ కన్నుతో డ్రగ్స్ ముఠాలను పట్టుకుంటూనే మరోవైపు పట్టుబడిన మాదకద్రవ్యాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీసులు దాదాపు 5000 కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. మూడేళ్లుగా వివిధ కేసుల్లో పట్టుకున్న పలు రకాల మాదకద్రవ్యాలను పూర్తిగా ధ్వంసం చేశారు. దాదాపు 122 కేసుల్లో 30 ఠాణాల పరిధిలో పట్టుబడిన 2600 లీటర్ల హశిష్ ఆయిల్, 45.4 గ్రాముల కొకైన్, 6.6 గ్రాముల చరస్, 46 గ్రాముల హెరాయిన్, పెద్ద మొత్తంలో గంజాయి ధ్వంసం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని నందిగామలో బయో మెడికల్ పరిశ్రమలో వీటిని పోలీసులు ధ్వంసం చేశారు.
5000 కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేసిన పోలీసులు
Published : Jun 14, 2024, 10:19 PM IST