ETV Bharat / snippets

కాళేశ్వరంపై తదుపరి విచారణ కోసం - ఈనెల 16న హైదరాబాద్​కు జస్టిస్ పీసీ ఘోష్

PC GHOSH ENQUIRY STARTS AGAIN
PC Ghosh Enquiry Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 8:59 AM IST

PC Ghosh Enquiry On Kaleshwaram Updates : కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శుక్రవారం నుంచి తదుపరి విచారణ ప్రక్రియను కొనసాగించనుంది. కోల్​కతా నుంచి ఆయన ఈ నెల 16న హైదరాబాద్ రానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఇప్పటికే ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, విశ్రాంత ఇంజినీర్లు, ఇతరులను విచారణ చేసిన కమిషన్, వారి నుంచి అఫిడవిట్లు తీసుకుంది.

ఆ ఆఫిడవిట్లన్నింటినీ కమిషన్ పూర్తిస్థాయిలో విశ్లేషిస్తోంది. అందులోని అంశాల ఆధారంగా తదుపరి ప్రక్రియను కొనసాగించనున్నారు. అఫిడవిట్లలో ఉన్న అంశాలపై బహిరంగ విచారణకు కూడా జస్టిస్ పీసీ ఘోష్ సిద్ధమవుతున్నారు. సాక్ష్యాల నమోదు, క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేపట్టనున్నారు. సాంకేతిక అంశాలపై కమిషన్ కసరత్తు దాదాపుగా పూర్తి కాగా ఆర్థిక అంశాలపై కూడా దృష్టి సారించింది. ఈ దఫా మరికొందరు కూడా కమిషన్ ముందు హాజరుకానున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.