ETV Bharat / snippets

'మీ అబ్బాయి ఓ అమ్మాయికి యాక్సిడెంట్ చేశాడు - రూ.3 లక్షలు ఇవ్వకపోతే కాల్చేస్తాం'

Online Cyber Fraud
Cyber Crime (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 1:53 PM IST

Online Cyber Fraud in Jangaon : ఆన్​లైన్ మోసానికి గురైన ఓ వ్యాపారి ఏకంగా రూ.88 వేలు పోగొట్టుకున్న ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాలకుర్తి మండల కేంద్రంలో వ్యాపారం చేస్తూ, వారి కుమారుడిని విదేశాల్లో చదివిస్తున్నారు. ఈనెల ఆగస్టు 18న సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్​చేసి సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని, మీ అబ్బాయి ఓ అమ్మాయిని యాక్సిడెంట్ చేశాడని చెప్పారు.

గాయపడ్డ వారికి చికిత్సతో పాటు, కేసు కాకుండా ఉండేందుకు రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఫోన్ కాల్​కట్ చేస్తే మీ అబ్బాయిని కాల్చేస్తామని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. భయానికి గురైన ఆ వ్యక్తి యూపీఐ ద్వారా రూ.88 వేలు పంపించారు. వెంటనే అతని భార్య కుమారుడికి ఫోన్ చేయగా ఎలాంటి యాక్సిడెంట్ చేయలేదని అతను చెప్పడంతో, వారు మోసానికి గురయ్యామని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.