Warangal Bhadrakali Temple : ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు అమ్మవారికి అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని గాయత్రి అలంకరణలో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లో బారులు తీరారు. ఐదు తలలతో కొలువుదీరిని గాయత్రి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సాయంత్రం అమ్మవారిని గజవాహనంపై ఊరేగించనున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.