ETV Bharat / snippets

పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు

Defamation Case On CM Revanth
Notices To CM Revanth Reddy On Defamation Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 9:30 PM IST

Notices To CM Revanth Reddy On Defamation Case : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి నాంపల్లి స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను వచ్చే నెల 25వ తేదీలోపు అందజేయాలని ఆదేశించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు వేసిన పరువు నష్టం కేసు విచారణలో భాగంగా ఉత్తర్వులు వెలువరించింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో రేవంత్ తప్పుడు ప్రచారం చేశారని కాసం వెంకటేశ్వర్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని నిరాధార ఆరోపణలు చేశారని, దీనివల్ల బీజేపీకి పరువు నష్టం కలిగిందని ఆయన పిటిషన్‌లో తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్ల వాంగ్మూలం సేకరించింది. బహిరంగ సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడిన వీడియోలను పరిశీలించింది. ఈ కేసులో రేవంత్‌రెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.