ETV Bharat / snippets

'జీఎస్టీ పన్నుఎగవేత విచారణకు సీబీఐకి అప్పగించండి' - అమిత్​ షాకు రాజాసింగ్​ లేఖ

MLA Raja Singh Letter To Central Minister Amit Shah
MLA Raja Singh Letter To Central Minister Amit Shah (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 7:16 PM IST

MLA Raja Singh Letter To Central Minister Amit Shah : జీఎస్టీ పన్ను ఎగవేత కేసు విచారణను సీఐడీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు ఎమ్మెల్యే రాజా సింగ్​ లేఖ రాశారు. బీఆర్​ఎస్​ హయాంలో సీఎస్​గా సోమేశ్​కుమార్​ పనిచేసిన సమయంలో రూ.వేయి కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు పోలీసులు గుర్తించారని పేర్కొన్నారు.

సోమేశ్​కుమార్​తో పాటు మరో ముగ్గురు అధికారులపై కేసు నమోదైనట్లు లేఖలో వివరించారు. అయితే కేసులో నిందితులందరూ ఉన్నతాధికారులు కావడంతో సీఐడీ విచారణ పట్ల ఆందోళన కలుగుతుందన్నారు. పారదర్శకత కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐలో విచారణ జరిపించాలని లేఖలో కోరారు. పన్ను ఎగవేత ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు. స్కామ్‌కు సంబంధించిన సొత్తు మొత్తాన్ని రికవరీ చేసి దర్యాప్తు సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని పెంచాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.