ETV Bharat / snippets

రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తాం : మంత్రి తుమ్మల

Minister Tummala Nageswara Rao about Runamafi
Minister Tummala Nageswara Rao Fires on BJP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2024, 12:46 PM IST

Minister Tummala Nageswara Rao Fires on BJP : రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలంగాణ రాష్ట్రంలో రూ.18 వేల కోట్ల రుణమాఫీ కనిపించడంలేదా అని, బీజేపీ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. తాము నిత్యం రైతుల్లోనే తిరుగుతున్నామని, ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నిరసన సెగ తాకేదే కదా అన్నారు.

సోమవారం గాంధీభవన్‌లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే చూపించాలని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయిన బాధ ఒకరిదైతే, అధికారంలోకి రావాలనే బాధ ఇంకోకరిదని ఎద్దేవా చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.