ETV Bharat / snippets

ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగన్​వాడీ కేంద్రాలు మంజూరు చేయండి : సీతక్క

Minister Seethakka On Anganwadi
Minister Seethakka On Anganwadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 10, 2024, 5:11 PM IST

Minister Seethakka On Anganwadi : ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగన్​వాడీ కేంద్రాలను మంజూరు చేయాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవిని రాష్ట్ర మంత్రి సీతక్క కోరారు. రాష్ట్రాల మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన ఆమె పలు అవసరాలను ప్రస్తావించారు. అంగన్​వాడీ కేంద్రాల్లో టీచ‌ర్లకు ట్యాబ్​లు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.

అంగ‌న్​వాడీల్లో నర్సరీ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపిన సీతక్క కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో 3,989 మినీ అంగన్​వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చినట్లు వివరించారు. రిటైర్ అయ్యే అంగన్​వాడీ టీచర్లకు రూ.2 లక్షలు ఆయాల‌కు ల‌క్ష రూపాయ‌ల బెనిఫిట్స్ ఇవ్వబోతున్నట్లు సీతక్క కేంద్ర మంత్రికి వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.