Minister Ponguleti Srinivas Reddy Injured : గత రెండు రోజులుగా ఖమ్మం జిల్లా కేంద్రంలో వరద బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు నుంచి వచ్చే వరద నీటితో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు, వీధులు జలమయం అయ్యాయి. నేడు కాస్త ఎడతెరిపి ఇవ్వడంతో ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు.
వరద ప్రాంతాల్లో బైకుపై మంత్రి పొంగులేటి ప్రయాణించారు. ఈ క్రమంలో బైకు పైనుంచి కిందపడటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాలికి గాయం అయింది. గాయం తీవ్రత పెద్దది కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.