Medaram Temple Priests Protest : వరంగల్ సెంట్రల్ జైలు ఎదుట మేడారం ఆలయం పేరిట కేటాయించిన స్థలంలో నిర్మించిన ధార్మిక భవనం గురించి మేడారం పూజారులు సమ్మక్క, సారలమ్మల గద్దెల ముఖద్వారం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. వరంగల్ సెంట్రల్ జైలు ఎదురుగా 1014 గజాల స్థలాన్ని మేడారం ఆలయ సౌకర్యాల నిమిత్తం 1993 సంవత్సరంలో దేవాదాయ శాఖ మేడారం పేరిట కేటాయించింది. ఆ భూమిలో ఏర్పాటు చేసిన ధార్మిక భవనాన్ని భద్రకాళి ఆలయ అర్చకులు, అధికారులు తమకు దక్కకుండా వేద పాఠశాల పేరుతో దక్కించుకుంటున్నారని మేడారం పూజారులు ఆక్షేపించారు. ఈ విషయంపై పలుమార్లు స్థానిక ఎమ్మెల్యేకు, మంత్రులకు వినతులు సమర్పించిన పట్టించుకోకపోవడంతో న్యాయం జరగాలని నిరసన దిగామని సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గిరిజన పూజారులు తెలిపారు.
నల్ల బ్యాడ్జీలతో మేడారం పూజారుల ధర్నా
Published : May 29, 2024, 3:15 PM IST