Prostitution Racket Bust in Hyderabad : విదేశీ యువతులతో ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకుడిని సైబరాబాద్ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు అరెస్టు చేశారు. 17మంది విదేశీ యువతులను అదుపులోకి తీసుకుని సేఫ్‌హౌస్‌కు తరలించారు. అందులో 14మంది ఉగాండా దేశానికి చెందిన వారు కాగా, ఒకరు టాంజానియా, మరో ఇద్దరు ముంబయి, బెంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కొండాపూర్ ఓ నివాసంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో నిర్వాహకుడు శివతో పాటు మరో ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 మొబైల్ ఫోన్‌లు, 25 హెచ్‌ఐవీ కిట్‌లు, రూ.20వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.