ETV Bharat / state

అమెరికాలో రోడ్డు ప్రమాదం - హైదరాబాద్​ యువకుడి దుర్మరణం - ROAD ACCIDENT IN AMERICA

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన హైదరాబాద్​ యువకుడు - ఎమ్మెస్​ చదువు కోసం అమెరికా వెళ్లిన సంతోష్​ కుమార్​ యాదవ్​(27)

YOUNG MAN DIED IN ROAD ACCIDENT
సంతోష్‌ కుమార్‌ యాదవ్‌(27) ఫైల్​ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2024, 1:29 PM IST

Road Accident in America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ వాసి దుర్మరణం చెందాడు. ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బెంగాల్‌కు చెందిన రాం ఆశీశ్‌ కుటుంబం గత కొన్ని సంవత్సరాల క్రితం బతుకుదెరువు నిమిత్తం హైదరబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ పరిధి పద్మానగర్‌ ఫేజ్-2లో నివసిస్తోంది. రాం ఆశీశ్‌కు సంతానం ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సంతోష్‌ కుమార్‌ యాదవ్‌(27) రెండేళ్ల క్రితం ఎమ్మెస్‌ చేయటానికి అమెరికాలోని ఓహియో వెళ్లాడు.

కారులో వెళుతుండగా ఎదురొచ్చిన మృత్యువు : ఆదివారం (నవంబర్ 17)న రాత్రి సంతోష్‌ కుమార్‌ యాదవ్‌ తన స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడిని కలవటానికి కారులో బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టడంతో సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడికి స్వల్ప గాయాలుకాగా ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ కుమారుడి మరణ వార్త విని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇరుగు పొరుగు వారు కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహాన్ని నగరానికి రప్పించటానికి ముఖ్య ప్రజా ప్రతినిధులను ఆశ్రయించారు.

గతంలోనూ రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భాలు : గత ఏడాది డిసెంబర్​ నెలలో టెక్సాస్‌‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ముమ్మిడివరం వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబ సభ్యులుగా అమెరికా అధికారులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో పొన్నాడ నాగేశ్వరరావు, భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, మనవరాలు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన అల్లుడు లోకేశ్‌ తీవ్రంగా గాయపడ్డారు.

చిన్నారితో సహా ఆరుగురి మృతి : రెండు వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఏడాది చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని అమెరికా పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన టెన్నెస్సీ రాష్ట్రంలోని ప్లెసెంట్ వ్యూ, స్ప్రింగ్‌ఫీల్డ్ సమీపంలో జరిగింది. 1 నుంచి 18 ఏళ్ల వయసు గల ఆరుగురు బాలికల మృతదేహాలను గుర్తించారు.

నిర్మల్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం - తండ్రీకొడుకు మృతి

లైవ్ వీడియో - బైక్​ను ఢీకొట్టిన కారు - స్పాట్​లో ఒకరు డెడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.