Edupayala Temple in Medak: మెదక్ జిల్లా ఏడుపాయలలోని వనదుర్గామాత ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్లవారుజామునే అమ్మవారికి సంప్రోక్షణ, అభిషేకం, విశేషాలంకరణతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. ఏడుపాయల ఆలయం ముందు మంజీరా నది పాయ వరద ఉద్ధృతి తగ్గింది. కానీ ఆలయంలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన అనంతరం భక్తులకు మూలవిరాట్ అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో (ఎండోమెంట్ ఆఫీసర్) చంద్రశేఖర్ తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా రాజగోపురంలో అమ్మవారి దర్శనం, నిత్య పూజలు కొనసాగుతున్నాయి.
మహిషాసుర మర్దినిగా ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి దర్శనం
Published : Oct 10, 2024, 12:20 PM IST