KTR Meets Kavitha in Tihar Jail : దిల్లీలోని తిహాడ్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. ఆమెను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. దిల్లీ మద్యం కేసులో కవితకు జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మద్యం కేసులో కవిత పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయగా, పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణను జులై 6న చేపడతామని స్పష్టం చేసింది.
తిహాడ్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్
Published : Jun 14, 2024, 12:45 PM IST