ETV Bharat / snippets

సచివాలయంలోకి సీఎం కాన్వాయ్ వచ్చే గేట్ మారింది

Secretariat Entry Changes
Key Changes in Secretariat Entries (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 11, 2024, 7:47 PM IST

Key Changes in Secretariat Entries : సచివాలయంలోకి ముఖ్యమంత్రి రాకపోకల విషయంలో కీలక మార్పులు జరిగాయి. సచివాలయం నిర్మించినప్పటి నుంచి గతంలో కేసీఆర్ ఆ తర్వాత రేవంత్ రెడ్డి తూర్పున ఉన్న ప్రధాన గేటు నుంచి లోపలికి వెళ్లి బయటకు వచ్చేవారు. కానీ ఈరోజు నుంచి జరిగిన మార్పుల ప్రకారం సీఎం, మంత్రులు, సీఎస్, డీజీపీ ఈశాన్యం వైపున ఉన్న 4వ గేటు ద్వారా లోపలికి వెళ్లి బయటకు వస్తున్నారు.

ఐఏఎస్​లు, ఐపీఎస్​లు, ఇతర అధికారులు ఆగ్నేయం వైపున 5వ గేటును ఉపయోగిస్తున్నారు. పశ్చిమం వైపున 3వ గేటును రాకపోకల కోసం మరమ్మతులు చేస్తున్నారు. సచివాలయం ప్రారంభమైనప్పటి నుంచి సీఎం ఛాంబర్ ఆరో అంతస్తులోనే కొనసాగుతోంది. ప్రస్తుతం తొమ్మిదో అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భద్రత, ట్రాఫిక్ కోణాలతో పాటు వాస్తు మేరకు ఈ కీలక మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.