KCR Writ Petition in Telangana High Court : విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోర్టులో కేసీఆర్ రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని వ్యాజ్యంలో ఆయన పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని తెలిపారు. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగం అధికారులను ప్రతివాదులుగా కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై హైకోర్టుకు కేసీఆర్
Published : Jun 25, 2024, 1:55 PM IST