PC Ghose commission Investigation on kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలపై ఏర్పాటైన కమిషన్ బహిరంగ విచారణ ప్రక్రియను ప్రారంభించింది. విచారణ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు ఇంజినీర్లు, అధికారులు, పదవీ విరమణ చేసిన వారు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతరులను విచారణ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించింది. అఫిడవిట్లను పరిశీలించిన కమిషన్ వాటి ఆధారంగా బహిరంగ విచారణ ప్రారంభించింది.
నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా సుదీర్ఘకాలంగా పనిచేసిన మురళీధర్ ఇవాళ కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తున్నారు. అఫిడవిట్‌లోని అంశాలు, ఈఎన్సీ జనరల్ పాత్ర, కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు, డీపీఆర్ తయారీ, అందులోని అంశాలపై మురళీధర్‌ను కమిషన్ ప్రశ్నిస్తోంది. ఆయన సమాధానాలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తున్నారు.