Telangana Weather Report Today : నైరుతి రుతుపవనాలు రాగల 24 గంటల్లో కేరళలోకి ప్రవేశించటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాగల రెండు రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి రాష్ట్రంలో కిందిస్థాయి గాలులు వీస్తున్నట్లు తెలిపింది.
రాగల రెండురోజులు పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం : ఐఎండీ
Published : May 29, 2024, 3:24 PM IST