ETV Bharat / entertainment

అక్కడ ఆఫీస్​బాయ్​గా కూడా పని చేయను! : మోహన్​ లాల్ - MOHAN LAL AMMA PRESIDENT

'అమ్మ'పై మోహన్​లాల్ కీలక వ్యాఖ్యలు- అక్కడ ఆఫీస్​బాయ్​గా కూడా చేయనని చెప్పిన హీరో!

Mohanlal Amma President
Mohanlal Amma President (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2024, 12:29 PM IST

Mohan Lal AMMA President : జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్​ చర్చనీయాంశమైన నేపథ్యంలో అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (AMAA) అధ్యక్ష పదవికి నటుడు మోహన్​లాల్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయనే మళ్లీ 'అమ్మ' ప్రెసిడెంట్​గా బాధ్యతలు స్వకరించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

అయితే ఈ వార్తలను ఆయన తిప్పికొట్టారు. అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆ అసోసియేషన్​కు ఆఫీస్ బాయ్​గా కూడా పని చేయడం తనకు ఇష్టం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. హేమ కమిటీ రిపోర్ట్​లో బయటపడ్డ విషయాలు చూసే తాను షాక్​కు గురయ్యానని చెప్పారు.

'మేము ఒక్కసారిగా అసోసియేషన్‌కు సంబంధించిన పదవుల బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కారణాలు చెప్పాలని చాలా మంది అడుతున్నారు. దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీదే. ఆ నివేదికలో ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రిపోర్ట్​లో వెలుగులోకి వచ్చిన విషయాల పట్ల ప్రతిఒక్కరూ 'అమ్మ' నే ప్రశ్నించారు' అని ఆయన పేర్కొన్నారు.

ఏంటీ ఈ హేమా కమిటీ రిపోర్ట్?
మాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ కొన్నేళ్లపాటు శ్రమించి ఓ స్ట్రాంగ్ నివేదికను రూపొందించింది. ఈ ఏడాది ఆగస్టులో అది వెలువడింది. అందులో పలు షాకింగ్‌ విషయాలు బయటకి వచ్చాయి. ఆ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కండిషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను రీసెర్చ్​ చేసిన హేమా కమిటీ, కాస్టింగ్‌ కౌచ్​ నుంచి వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు పడుతున్న అనేక ఇబ్బందుల గురించి అందులో పేర్కొంది.

దీంతో అప్పట్లో ఈ కమిటీ రూపొందించిన నివేదిక మాలీవుడ్​లో తీవ్ర దుమారం రేపింది. మహిళా నటులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమకు ఇండస్ట్రీలో ఎదురైన సమస్యలు బయటపెట్టారు. ఈ నేపథ్యంలో అప్పటి అమ్మ అధ్యక్షుడు మోహన్​లాల్ ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులు కూడా పదవుల నుంచి వైదొలిగారు.

హేమ కమిటీ రిపోర్ట్ ఎఫెక్ట్‌ - మోహన్​లాల్ సహా 17 మంది 'అమ్మ'కు రాజీనామా - Mohanlal AMMA Resignation

మాలీవుడ్​ను నాశనం చేయొద్దు- వారికి శిక్ష తప్పదు: మోహన్ లాల్ - Mohanlal

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.