HYDRA INSPECT IBRAHIMPATNAM CHERUVU: రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హైడ్రా బృందం ఆకస్మిక తనిఖీలు చేసింది. ఇబ్రహీంపట్నంలోని నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పెద్ద చెరువుని హైడ్రా పరిశీలించింది. ఈ చెరువును ఆనుకుని ఉన్న చిన్న చెరువు, ఉప్పరిగూడ, పోచారం, చర్ల పటేల్ గూడా గ్రామాల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అక్రమ నిర్మాణాలను తాము కూల్చి వేయకముందే యజమానులే సరైన నిర్ణయం తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఓఆర్ఆర్ వరకే హైడ్రా పరిమితం అని చెప్పినప్పటికీ ఇబ్రహీంపట్నం చెరువుని హైడ్రా పరిశీలించడంతో బఫర్ జోన్లో నిర్మాణాలు చేసిన వారు ఆందోళన పడుతున్నారు. హైడ్రా బృందంతో పాటు ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువును పరిశీలించిన హైడ్రా - ఆక్రమణల గుర్తింపు
Published : Sep 23, 2024, 5:30 PM IST