Heavy Rain Alert To Telangana : రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి వర్షం పడే అవకాశం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు పడుతాయని తెలిపింది. నగరంలో మధ్యాహ్నం నుంచి వర్షం కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ, డిసాస్టర్ మేనేజ్మెంట్ను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు - ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
Published : Jun 2, 2024, 12:47 PM IST