Metro Paid Parking Postponed : నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ ఫీజు వసూళ్లపై ఎల్అండ్టీ మెట్రోరైలు సంస్థ వెనక్కి తగ్గింది. పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి నేటి నుంచి నాగోల్ మెట్రోస్టేషన్, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. కానీ ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, నిరసనల దృష్ట్యా తాత్కాలికంగా పెయిడ్ పార్కింగ్ అంశాన్ని వాయిదా వేశామని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తదుపది నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది.
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్ - మెట్రో పెయిడ్ పార్కింగ్‌పై వెనక్కి తగ్గిన ఎల్ అండ్ టీ
Published : Aug 25, 2024, 7:30 AM IST