ETV Bharat / snippets

గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించడం లేదా? - ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్

HARISH RAO FIRES ON CONGRESS
Ex Minister Harishrao on Gurukulas Jobs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 4:43 PM IST

Ex Minister Harishrao on Gurukulas Jobs : రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సీఎం ఇంటి ముందు మోకాళ్ల మీద నిలబడి ఎన్నిసార్లు అభ్యర్థించినా గురుకుల అభ్యర్థుల మొర ఆలకించకపోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గురుకులాల్లో టీచర్ల కొరత లేకుండా చేసి, విద్యాప్రమాణాలు మరింత పెంచేందుకు గాను, బీఆర్ఎస్ ప్రభుత్వం 9210 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిందని హరీశ్‌రావు వివరించారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వల్ల దాదాపు 2500 పైగా టీచర్ పోస్టులు మిగిలిపోయి, అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పోస్టులు బ్యాక్‌లాగ్ అవ్వకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి, అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.