Telangana Govt Key Decision : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలపై సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందివ్వాలని నిర్ణయించింది. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవ కానుకగా ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఈమేరకు ఇంధన కార్యదర్శి రోనాల్డ్ రోస్ ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ వెంటనే అమలుచేయనున్నట్లు జీఓలో రోనాల్డ్ రోస్ వెల్లడించారు. విద్యా సంస్థల జాబితాను తయారు చేయాలని విద్యా శాఖ కార్యదర్శికి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
సర్కారు కీలక ప్రకటన - ప్రభుత్వ పాఠశాలలకు ఇకనుంచి ఉచిత విద్యుత్
Published : Sep 5, 2024, 9:40 PM IST