ETV Bharat / snippets

బిట్రగుంట రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్‌- వారంలో ఇది రెండో ఘటన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 7:30 PM IST

Goods Train Derailed in Bitragunta of Nellore District
Goods Train Derailed in Bitragunta of Nellore District (ETV Bharat)

Goods Train Derailed in Bitragunta of Nellore District : నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. LC గేటు 144 వద్ద రైలు బోగి పట్టాలు తప్పడంతో రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. తరువాత రైల్వే గేటు మూతపడటంతో వాహన రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందిగా మారింది. ఈ ఘటనతో విజయవాడ - చెన్నై మధ్య రైళ్ల రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదే ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలో 2 రైళ్లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.