GHMC Summer Coaching Camps Time Extended : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరాల(సమ్మర్ క్యాంప్స్) సమయాన్ని పొడిగిస్తూ బల్దియా నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 10 వరకు నగరంలో సమ్మర్ క్యాంప్స్ను కొనసాగించాలని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి మే 31తోనే ఇవి ముగియాల్సి ఉండగా మరో 10 రోజులపాటు పొడిగిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. సంబంధిత జోనల్ కమిషనర్లు ఈ విషయాన్ని గ్రహించి వేసవి శిక్షణ శిబిరాల్లో అన్ని ఆటలు, ఈవెంట్లను కొనసాగించాలని సూచించారు. అంతేకాకుండా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు కూడా అందజేయాలని ఆదేశించారు. ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా జీహెచ్ఎంసీ క్రీడా విభాగం ఆధ్వర్యంలో366 ప్రాంతాల్లో 44 క్రీడల్లో సమ్మర్ క్యాంప్స్ను నిర్వహిస్తున్నారు. మొత్తం 37 రోజులపాటు శిక్షణ ఖరారు చేయగా మరో 10 రోజులపాటు శిబిరాలు కొనసాగనున్నాయి.
చిన్నారులకు గుడ్న్యూస్ - జూన్ 10 వరకు జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంప్స్
Published : May 28, 2024, 8:26 PM IST
|Updated : May 28, 2024, 8:33 PM IST