Niranjan Reddy Fires on Congress : వానాకాలం నుంచే రైతుభరోసా పథకం కింద ఎకరాకు 7500 రూపాయల పథకం అమలు చేయాలని, మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుకు ‘భరోసా’ ఉన్నట్లా? లేనట్లా ? అని ప్రశ్నించిన ఆయన, ఎన్నికల ప్రచారం మీద ఉన్న సోయి పథకం విధి విధానాల రూపకల్పన మీద ఉండదా అని ప్రశ్నించారు.
ఏడు నెలల నుంచి ముఖ్యమంత్రి, మంత్రులకు తీరిక లేదా అని ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి, ఏ పథకం గురించి అడిగినా దెయ్యానికి భయపడి వెనకటికి గోడల మీద ‘ఓ స్త్రీ రేపురా’ అని రాసి ఉండే కథను వినిపిస్తున్నారని ఆక్షేపించారు. డిసెంబరు 9న 15 వేల రైతు భరోసా అన్న ముఖ్యమంత్రి హామీలు, నీటి మీది రాతలే అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు.