Harish Rao on Crop Loan Waiver : కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులే రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని అంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పాక్షికంగా మాత్రమే రుణమాఫీ జరిగిందని తాను చెబుతుంటే, కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. పూర్తిగా రుణమాఫీ జరిగి ఉంటే రాష్ట్రంలో రైతులు ఎందుకు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని ఆయన నిలదీశారు. ప్రతీ అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం అవివేకం అవుతుందన్న హరీశ్‌రావు, రుణమాఫీ ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.
'రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని మీరే చెబుతున్నారు - ఇప్పుడు రాజీనామా చేయాల్సిందెవరు?'
Published : Aug 18, 2024, 6:54 PM IST