ETV Bharat / snippets

జీరో బిల్లులు జనరేట్ కాలేదనే నెపంతో - పెండింగ్ బిల్లులు వసూలు చేయడం దుర్మార్గం : హరీశ్​రావు

HARISH RAO TWEET ON CONGRESS
Harish Rao about Gruha Jyothi scheme (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 11:29 AM IST

Harish Rao about Gruha Jyothi scheme : గృహజ్యోతి పథకం కింద పేదలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అని చెప్పి, వారి నుంచి బిల్లులు వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేస్తూ, దాన్ని పూర్తిగా అటకెక్కిస్తుందని ఎక్స్​ వేదికగా ఆయన మండిపడ్డారు.

జీరో బిల్లులు జనరేట్ కాలేదనే నెపంతో పేదల నుంచి పెండింగ్ బిల్లులు వసూలు చేయడం దుర్మార్గమని హరీశ్​రావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీల్లోని 13 హామీల్లో ఒక్క పథకాన్ని కూడా కాంగ్రెస్ సంపూర్ణంగా అమలు చేయలేదని ట్వీట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.