Food Safety Officers Inspection in Bhadrachalam : భద్రాచలంలో నిబంధనలు పాటించకుండా ఆహారపదార్థాలు తయారు చేస్తున్న మూడు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లేని పరిసరాలను గమనించి ఒక హోటల్‌ను సీజ్ చేయడంతోపాటు మరో రెండింటికి నోటీసులు జారీ చేశారు. మూడు హోటళ్లకు 40 వేల జరిమానా విధించారు.
భద్రాచలం ప్రధాన రహదారిలోని శ్రీ భద్ర గ్రాండ్, శ్రీ గౌతమి స్పైస్, శ్రీ రాఘవేంద్ర టిఫిన్ అండ్ మీల్స్ హోటళ్లలో ఆహారభద్రతా, నాణ్యత బృందాలు తనిఖీలు చేశాయి. రిఫ్రిజిరేటర్‌లోని ఐస్‌క్రీమ్‌లో ఫంగస్ కనిపించడంతో పాటు అపరిశుభ్ర వాతావరణంపై జోనల్ ఫుడ్ సేఫ్టీ అధికారిణి జ్యోతిర్మయి హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక హోటల్‌ను సీజ్ చేసిన అధికారులు, పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగతా హోటళ్లను సీజ్ చేస్తామని నోటీసులు జారీ చేశారు.