Five IPS Officers Transfers in Telangana : పాలనా ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఐదుగురు ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది. అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్న సీవీ ఆనంద్‌ను తిరిగి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించింది. ప్రస్తుతం భాగ్యనగరం కొత్వాల్‌గా ఉన్న కొత్తకోట శ్రీనివాస రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు బదిలీ చేసింది. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేశ్ భగవత్‌ను హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ పోలీస్ బాధ్యతలను అప్పగించారు. ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్ నియమితులయ్యారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న రమేశ్ ఐపీఎస్ ఆఫీసర్‌కు ప్రొవిజనింగ్‌తో పాటు హైదరాబాద్ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ స్పోర్ట్స్ అదనపు విధులను అప్పగించారు. వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్‌లకు స్థానచలనం - హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
Published : Sep 7, 2024, 2:58 PM IST
|Updated : Sep 7, 2024, 3:45 PM IST