ETV Bharat / snippets

సంస్థకే కన్నం వేసిన డ్రైవర్, రూ. 5లక్షలపై నగదు చోరీ - తండ్రీకుమారుల అరెస్టు

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 10:31 PM IST

Robbery Case
father and son arrest in robbery (ETV Bharat)

Robbery Case : జీవితం స్థిరపడటం కోసం పని చేసే సంస్థకే కన్నం వేయాలని చూసి ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. దొంగతనంలో సాయం చేసిన అతని తండ్రి కూడా నేరంలో భాగస్వామ్యం అయ్యాడు. తండ్రీకుమారుల నుంచి రూ.5 లక్షల 30 వేల నగదును నారాయణగూడ పోలీసులు స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. గత నెల 22న రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ డబ్బులు తరలించే వాహనంలో ఆ సంస్థ డ్రైవర్​ ఉద్యోగస్థులు లేని సమయంలో చోరీ చేసి తండ్రికి ఇచ్చాడు.

డబ్బులు పోయిన తరువాత డ్రైవర్ మహ్మద్ రహీం పాషా విధుల్లోకి రాకపోవడంతో అనుమానం వచ్చి సంస్థ బ్రాంచ్ హెడ్ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో డ్రైవర్​పై నిఘా పెట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఆ డబ్బును తండ్రి మహ్మద్ యాకుబ్​కు అందజేసినట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.