ETV Bharat / snippets

రుణమాఫీ కాని రైతులకు అలర్ట్​ - నేటి నుంచి సమగ్ర సర్వే స్టార్ట్​

NON LOAN WAIVED FARMERS IN TG
Farmers Non Loan Waiver Details Survey (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 1:13 PM IST

Farmers Non Loan Waiver Details Survey : రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్‌ తయారు చేసినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి అన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో టెస్ట్ ట్రయల్‌ చేసినట్లు తెలిపారు. రైతులకు ఆగస్టు15వ తేదీ నాటికి 22,37,848 మంది రైతులకు రుణమాఫీ అందజేశామని ఆయన వెల్లడించారు.

నేటి నుంచి పూర్తి స్థాయిలో ప్రతి జిల్లాలో గ్రామాల వారీగా మండల వ్యవసాయ అధికారి సమగ్ర సర్వే చేయడం జరుగుతుందని స్పష్టంచేశారు. ప్రతి మండల వ్యవసాయ అధికారి గ్రామాల వారీగా పక్కా ప్రణాళికలు తయారు చేసి కుటుంబ సభ్యుల వివరాలు యాప్‌లో నమోదు చేస్తారని వివరించారు. మంగళవారం జరిగిన టెలీకాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులైన రైతులందరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.