Kamalasan Reddy review on Drugs : ధూల్‌పేట్, జీహెచ్‌ఎంసీ పరిధిలో డ్రగ్‌ను నిర్మూలించే వరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు విశ్రమించేది లేదని ఎక్సైజ్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్‌టీఎఫ్, ఇతర టీమ్‌ల పనితీరుపై ఆయన సమీక్షించారు. ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసుల కంట్రోల్‌లో ఉందని, గంజాయి అమ్మకాలు 95 శాతంగా నిలిచి పోయాయన్నారు. చాల మంది గంజాయి అమ్మకందార్లు జైళ్లలో ఉన్నారని, ఆగస్టు 31 నాటికి మొదటి దశ తనిఖీల్లో ధూల్‌పేట్ పూర్తిగా కంట్రోల్‌కు వచ్చిందన్నారు. మిగిలిన టీమ్‌లు ఎన్‌డీపీఎస్ లక్ష్యంగా నిరంతరం తనిఖీలు చేపట్టి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని అదేశించారు. గంజాయి అమ్మకందార్లలో పరివర్తన చెందిన వారిని బైండోవర్ చేయాలని సూచించారు. ఎక్సైజ్ దాడులతో పాటు స్థానిక పోలీసుల సహకారంతో జాయిండ్ తనిఖీలు, దాడులు నిర్వహించాలని కోరారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ డ్రగ్స్ స్పాట్‌గా గుర్తించిన ప్రాంతాలపై నిఘా పెంచాలన్నారు.
నగరంలో డ్రగ్స్‌ను నిర్మూలించే వరకు విశ్రమించేది లేదు : కమలాసన్ రెడ్డి
Published : Aug 29, 2024, 10:28 PM IST