Engineering Seat Allotment In Telangana : ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. మొదటి రౌండ్లో కన్వీనర్ కోటా కింద ఉన్న 78,694 సీట్లలో 75,200 సీట్లను కేటాయించారు. ఈ మేరకు ఈఏపీ సెట్ కన్వీనర్ దేవసేన ప్రకటించారు. తొలి విడతలో 95.6 సీట్ల కేటాయింపు పూర్తయినట్టు పేర్కొన్నారు.
కంప్యూటర్ కోర్సుల్లో 99.31 శాతం సీట్ల కేటాయింపు పూర్తవగా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్లో 92.5, సివిల్ ఇంజినీరింగ్లో 80.68, మెకానికల్లో 71.54 శాతం సీట్ల కేటాయింపు పూర్తయింది. సీటు వచ్చిన విద్యార్థులు ఈ నెల 23లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఈఏపీసెట్ కన్వీనర్ ప్రకటించారు. తొలి విడతలో మిగిలిన సీట్లను రెండో విడతలో కేటాయించనున్నారు.