ED Attach IDBI Bank Loan Fraud: చేపల చెరువుల కోసమని రుణాలు తీసుకొని ఐడీబీఐ బ్యాంకును మోసగించిన కేసులో కీలక నిందితుడు నేరెళ్ల వెంకట రామ్మోహన్రావు సహా ఇతరులకు చెందిన రూ.19.11 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటి మార్కెట్ విలువ రూ.71.61 కోట్లు ఉంటుందని తెలిపింది. గతంలో కిసాన్ క్రెడిట్ కార్డులలో అక్రమంగా సాగిన ఈ భారీ కుంభకోణంపై విశాఖపట్నం సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ చట్టం కింద మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేస్తోంది.
రామ్మోహన్ సహా 11 మంది సభ్యులు అగ్రిగేటర్లుగా ఉండి, 350 మంది లబ్దిదారులను చూపిస్తూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి వాటి ద్వారా ఐడీబీఐ బ్యాంకు అధికారుల సాయంతో రూ.311.05 కోట్ల రుణాలు పొందినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందుతుల ఏపీ, తెలంగాణాలోని ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది.