EC Raids on Chadalawada Infratech Limited in Hyderabad : రుణాలు తీసుకుని బ్యాంకును మోసం చేసిన కేసులో చదలవాడ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా కంపెనీతో పాటు డైరెక్టర్ చదలవాడ రవీంద్రబాబు, ఇతరులపై నమోదు చేసిన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఇందులో భాగంగా ఈనెల 3న హైదరాబాద్, ఒంగోలులో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసిన కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. పవర్ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రాజెక్టు కోసం 166.93 కోట్లు ఎస్బీఐ నుంచి రుణాలు తీసుకుని వాటిని దారి మళ్లించారని తెలిపింది. ఉద్యోగులు, డైరెక్టర్ల, ఇతరుల పేరిటి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ స్పష్టం చేసింది.