DY CM Bhatti Review On Power Generation : జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ఠ ఉత్పత్తిని సాధించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని హైడల్ ప్రాజెక్టుల సీఈలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్లో థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పత్తిపై ఆ శాఖల అధికారులతో భట్టి విక్రమార్క సమీక్షించారు. ప్రతి థర్మల్ పవర్ ప్లాంట్ కనీసం 17 రోజుల విద్యుత్ ఉత్పాదనకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల గతంలో శ్రీశైలం, జూరాల వంటి ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి ఏర్పడిన నష్టాన్ని భట్టి గుర్తు చేశారు. విద్యుత్ కేంద్రాల పరిస్థితి, ఉత్పాదనకు సంబంధించిన నివేదికలు ప్రతి వారం తనకు పంపాలని ఆదేశించారు.