ETV Bharat / snippets

ఒక్క ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​తో రూ.21 లక్షల విరాళాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 5:38 PM IST

21 Lakhs with a single Insta post
17 lakh Rupees fixed deposit (ETV Bharat)

Instagram post in Mahabubad: తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారుల దయనీయ గాథను ఓ యువకుడు వీడియోతీసి ఇన్స్​స్టాగ్రామ్​లో పోస్టు చేశాడు. దానిని చూసిన వారు రూ.21 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామంలో ఉమ, నరేష్ దంపతులకు రెండున్నర ఏళ్ల కుమార్తె , 21రోజుల కుమారుడు ఉన్నారు.

కుమారుడు జన్మించిన 18రోజుల తర్వాత ఉమ బ్రెయిన్ ట్యూమర్​తో మరణించింది. చిన్నారుల ఆలనాపాలన కోసం స్థానిక యువకుడు వీరి వీడియో తీసి ఇన్​స్ట్​గ్రామ్​లో పోస్ట్ చేశాడు. దాతల నుంచి రూ.23లక్షలు రాగా అంత్యక్రియలు, దశదినకర్మ, ఇతర అవసరాల కోసం రూ.లక్ష ఖర్చయ్యాయి. రూ.3 లక్షలను చిన్నారుల అవసరాల కోసం ఉంచారు. రూ.17 లక్షలను చిన్నారి నిత్విత పేరిట మహబూబాబాద్​లోని ఎస్​బిఐ బ్యాంక్​లో ఫిక్స్​డ్​ డిపాజిట్ చేశారు. ఆమెకు 22ఏళ్ల నాటికి రూ.80లక్షలు వచ్చే విధంగా చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.