ETV Bharat / snippets

మరి కొద్ది సేపట్లో శ్రీనివాసుడి దర్శనం- అంతలోనే గుండెపోటు

devotee_dies_of_heart_attack_in_tirumala
devotee_dies_of_heart_attack_in_tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 10:36 AM IST

Devotee Dies of Heart Attack in Tirumala : తిరుమలలో గుండెపోటుతో భక్తురాలు మృతి చెందింది. శనివారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో ఈ ఘటన చోటు చేసుకుంది. సర్వదర్శనం క్యూలైన్‌లో వెళ్తుండగా ఒక్కసారిగా ఆమె కుప్పకూలింది. వెంటనే తోటి భక్తులు, డిస్పెన్సరీ నర్సులు సీపీఆర్ చేశారు. ఈక్రమంలో ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేలోపు మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని లండన్‌లో స్థిరపడిన కడప జిల్లా వాసి ఝాన్సీ(32)గా గుర్తించారు. ఆమెకు కవల పిల్లలున్నారు. ఝాన్సీ మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. రెండు మెట్ల మార్గాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ల్లో డాక్టర్‌తో కూడిన అత్యవసర వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నతాధికారులున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.