ED on Telangana Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ సరఫరాలో అక్రమాలపై ఈడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈడీ పశుసంవర్ధకశాఖ నుంచి కోరిన సమాచార సేకరణకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ శాఖలో ముఖ్యకార్యదర్శి సహా ఇతర పోస్టుల్లో కొత్త అధికారులు బాధ్యతలు చేపట్టడమే ఇందుకు కారణమని తెలిసింది. ఈ పోస్టు ఈనెల ఒకటో తేదీ నుంచి ఖాళీగా ఉంది. గురువారం రోజున ఈ శాఖ అదనపు సంచాలకుడు సుబ్బరాయుడు సమాఖ్య ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు యువజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ పశుసంవర్ధకశాఖ ముఖ్యకార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరిన సమాచారం విషయమై అధికారులు ఈరోజు తెలంగాణ సర్కార్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది.
గొర్రెల పంపిణీ స్కామ్ అప్డేట్ - ఈడీకి సమాచారం ఇచ్చేందుకు ఆలస్యం
Published : Jun 14, 2024, 12:25 PM IST
|Updated : Jun 14, 2024, 12:46 PM IST