ETV Bharat / snippets

స్కిల్​ వర్సిటీ కోసం కార్పస్​ ఫండ్​కు రేవంత్​ పిలుపు - రాష్ట్రం తరఫున రూ.100 కోట్లు

CM Revanth On Young India Skill University
CM Revanth On Young India Skill University (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 6:19 PM IST

CM Revanth On Young India Skill University : రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ.100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని, ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాల్లో సహకారం అందించాలని పారిశ్రామికవేత్తలను కోరారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు.

కార్యక్రమంలో ఈ ఏడాది నుంచి స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సుల వివరాలను, కీలక అంశాలను అధికారులు పారిశ్రామికవేత్తలకు వివరించారు. రాష్ట్రం నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని ఆనంద్ మహీంద్రా కొనియాడారు. మంచి విజన్ ఉన్న నాయకుడు రేవంత్‌రెడ్డి అంటూ ప్రశంసించారు. అందుకే యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్‌గా ఉండాలని ఆయన కోరగానే, ఒప్పుకున్నానని ఆనంద్ మహీంద్రా అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.