CM Revanth Decided To Transgenders As Volunteers in Traffic : హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయడంలో ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. హోమ్గార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌పై అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్ క్రమబద్ధీరించడంలో ట్రాన్స్‌జెండర్లు వాలంటీర్‌గా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారి సంబంధించి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీలో టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దని ఆదేశాలు జారీ చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్ 15 రోజులులోగా అందించాలన్న సూచించారు. తప్పుడు నివేదికలు ఇస్తే మాత్రం అధికారులపైనా చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.