ETV Bharat / snippets

బాల్యమిత్రునికి అండగా నిలిచిన దోస్తులు - రూ.55వేల ఆర్థిక సాయం

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 7:05 PM IST

Friends Supporting Their Friend'S Family
Friends Supporting Their Friend'S Family (ETV Bharat)

Friends Supporting Their Friend'S Family : తమతో పాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు అకాల మరణం చెందడంతో అతడి కుటుంబానికి రూ.55,000 ఆర్థికసాయం చేసి తమ మంచి మనసు చాటుకున్నారు అతడి మిత్రులు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.

లింగాపూర్​ గ్రామానికి చెందిన మీసా నరసింహులు దుల్మిట్ట జడ్పీ ఉన్నత పాఠశాలలో 2005 బ్యాచ్​లో పదో తరగతి చదువుకున్నారు. అయితే ఇటీవల ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న అతడి మిత్రులు నరసింహులు కుటుంబానికి ఏదైనా సాయం చేయాలనుకున్నారు. మిత్రులంతా కొంత సొమ్ము సేకరించి నరసింహులు కుమార్తె పేరు మీదుగా పోస్టు ఆఫీసులో కిసాన్​ వికాస్​ పత్ర పథకంలో రూ.55వేల రూపాయలు ఫిక్స్​డిపాజిట్ చేసి స్నేహాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సెవెళ్ల సంపత్, సెవెళ్ల కృష్ణ , వినోద్ , చిరంజీవి, సాగర్, రమేష్,రాజు అశోక్ చిన్ననాటి మిత్రులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.